Home » ఎండు బొప్పాయి గింజలు తింటే ఎన్ని లాభాలంటే..?

ఎండు బొప్పాయి గింజలు తింటే ఎన్ని లాభాలంటే..?

by Sravanthi
Ad

ప్రస్తుతం ఉన్న పండ్లలో బొప్పాయి పండు అంటే చాలామంది ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపరు.. కాని దాని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బొప్పాయి అనేది మార్కెట్లో తక్కువ ధర లో దొరికే పండు.. అయితే బొప్పాయి దానిలోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని విషయం తెలుసుకోండి.. సాధారణంగా బొప్పాయి తినే ముందు దానిలో ఉండే గింజలను పడేస్తూ ఉంటాం. అయితే బొప్పాయి తినేటప్పుడు ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలి..

Advertisement

2004లో యూనివర్సిటీ ఆఫ్ ఉత్తర మలేషియా దేశంలో కొన్ని పరిశోధనలు చేసి బొప్పాయి విత్తనాలను ఎండబెట్టి తింటే చాలా మంచిదని తెలియజేశారు. ఎండు బొప్పాయి విత్తనాలలో 20 శాతం ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఈ విత్తనాలను తిన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి ఫైల్స్ ఇతర సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

Advertisement

అలాగే ప్రేగులలో లూస్ మోషన్స్ అయ్యేవారు ఈ ఎండు బొప్పాయి విత్తనాలు చాలా ఉపయోగపడతాయని పరిశోధన చేసి మరీ తెలియజేశారు. అలాగే బ్లీడింగ్ ఫైల్స్ అయ్యే వారికి కూడా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందని తెలుస్తోంది. పేగులలో మంచి బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా పచ్చి బొప్పాయి విత్తనాలు మాత్రం తినకండి. ఎండు బొప్పాయి విత్తనాలు అందుబాటులో ఉంటే తీసుకొని తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading