Home » ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..? సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది..?

ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..? సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది..?

by Anji
Ad

దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగబోయే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే బీజేపీతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలపై కీలకమైన తీర్పు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం 2017లో తెచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల బాండ్ పథకం రాజ్యాంగ విరుద్దామని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్  నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వెంటనే ఈ బాండ్స్ ఇష్యు ఆపేయాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.  అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? వీటిని ఎప్పుడు మనుగడలోకి తెచ్చారు? ఈ బాండ్స్ ఎవరు తీసుకోవచ్చు?  ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు సుప్రీం కోర్టు నిలిపివేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

వ్యక్తులు లేదా సంస్థల ద్వారా రాజకీయ పార్టీలకోసం విరాళాల సేకరణ చేయడానికి ఈ బాండ్స్ తీసుకువచ్చారు. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విక్రయిస్తారు. మొదటిసారిగా ఈ ఎలక్టోరల్ బాండ్స్  ని 2017 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీనికోసం ఆర్థిక చట్టం-2017 సవరణలు చేసి బాండ్స్ విధానము తీసుకువచ్చారు. వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల్లో బాండ్లను  విక్రయిస్తారు. ఎవరైనా సరే.. నచ్చిన పార్టీ పేరు మీద బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా  కొన్ని బాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. అంతేకాదు.. ఒక వ్యక్తి లేదా సంస్థ కొన్న బాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. ఇలా విరాళంగా ఇచ్చిన బాండ్స్ ని సంబంధిత రాజకీయ పార్టీ 15 రోజుల్లో నగదుగా మార్చుకోవాలి. లేకపోతె ఆ డబ్బు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి  వెళ్ళిపోతుంది.

 

2018 నుంచి 2021 వరకూ 15 దశల్లో 6535.75 కోట్ల రూపాయల విలువైన 12,924 బాండ్స్ అమ్మకం జరిగింది. ఈ బాండ్స్ లో పెద్ద అభ్యంతరకర విషయం ఏమిటంటే.. వ్యక్తులు, సంస్థలు, ధార్మిక ట్రస్టులు, ఎన్జీఓల పేర్లు బహిర్గతం చేయకుండా.. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు ఇవ్వచ్చు. దీనినే సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది.   ప్రజాప్రాతినిధ్యం చట్టం, 1951 (43) సెక్షన్‌ 29A కింద రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉండాలి. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ  కనీసం ఒక్క శాతం ఓటు షేరు సాధించాలి. ఎన్నికల సంఘం ధృవీకరించిన ఎకౌంట్ రాజకీయ పార్టీ కలిగి ఉండాలి. ఇలా అన్ని అర్హతలు ఉన్న పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడానికి వీలుంటుంది.

 

Visitors Are Also Reading