క్రికెట్లో పరుగులు కొత్తవి లేదా ప్రత్యేకమైనవేమి కావు. చాలా సార్లు మ్యాచ్‌ల్లో పేలవమైన పరుగు కోసం ప్రయత్నించిన కొన్ని సార్లు పెవిలియన్‌కు చేరడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇద్దరూ బ్యాట్స్‌మెన్ ఒకే ఎండ్ లో నిలబడి రనౌట్ అవుతుంటారు. ఇలాంటి రనౌట్లు కూడా చాలా సార్లు చూసాం. బ్యాట్స్‌మెన్ స్ట్రెయిట్ షాట్ బౌలర్ చేతికి తగిలి స్టంప్స్‌కు వెళ్లి తగలడంతో వికెట్లు చాలానే పడిపోయాయి. వెస్టిండిస్‌కు చెందిన ఆండ్రి రస్సెల్ మాత్రం విచిత్రంగా రనౌట్ అయ్యాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి రనౌట్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
Advertisement
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. టోర్నమెంట్ రెండవ మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన రనౌట్ చోటు చేసుకుంది. ఈమ్యాచ్ మినిస్టర్ గ్రూప్ ఢాకా, ఖుల్నా టైగర్స్ మధ్య జరిగినది. ఇందులో వెటరన్ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహముదుల్లా కెప్టెన్‌గా ఉన్న మినిస్టర్ గ్రూపు ఢాకా జట్టులో విండీస్ వెటరన్ రస్సెల్ సభ్యుడు. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ ఆటతీరును చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అతని అద్భుతమైన రనౌట్‌ను చూసి ఆశ్చర్యపోయారు.
Advertisement
మొదట బ్యాటింగ్ చేసి ఎంజీడీ జట్టు 15వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ క్రీజులో ఉన్నాడు. అతనితో కలిసి జట్టు కెప్టెన్ మెహమదుల్లా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఓవర్లో తిసార పెరీరా బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని చివరి బంతిని రస్సెల్ థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు. ఒక పరుగు కోసం పరుగెత్తాడు. థర్డ్ మ్యాన్ ఫీల్డర్ బ్యాటింగ్ ఎండ్‌లోని స్టంప్‌లను లక్ష్యంగా చేసుకున్నాడు. బంతి నేరుగా స్టంప్‌లను తాకింది. మెహముదుల్లా క్రీజులోకి వచ్చాడు. కానీ బంతి స్టంప్‌లను తాకి నేరుగా నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు మళ్లడంతో స్టంప్‌లపైన ఉంచిన బెయిల్లు చెల్లా చెదురుగా పడ్డాయి. ఇది చూసిన అభిమానులందరూ రస్సెల్ క్రీజులో లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఎంపైర్ అప్పటికే ఔట్ ఇచ్చాడు.
అయితే రస్సెల్ మాత్రం కేవలం 3 బంతుల్లో 7 పరుగులు చేశాడు. ఎంజీడీ తరుపున తమీమ్ ఇక్బాల్ 42 బంతుల్లో 50 పరుగులు చేయగా.. మహ్మద్ షాజాద్ 27 బంతుల్లో 42 పరుగులు చేసాడు. కెప్టెన్ మెహముదుల్లా 20 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 183 పరుగుతు చేసింది.