Home » అంపైర్లను తిట్టిన నికోలస్ పూరన్.. తాట తీసిన ఐసీసీ! భారీ జరిమానాతో పాటు..!

అంపైర్లను తిట్టిన నికోలస్ పూరన్.. తాట తీసిన ఐసీసీ! భారీ జరిమానాతో పాటు..!

by Bunty
Ad

గయానాలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం వెనుక ఆ జట్టు విధ్వంసకారుడు నికోలస్ పూరన్ ప్రధాన పాత్ర పోషించాడు. తక్కువ బంతులు ఆడి ఎక్కువ పరుగులు చేయడంలో నికోలస్ పురన్ పేరుగాంచాడు. ఈ ఇన్నింగ్స్ లో పురన్ కేవలం 40 బంతుల్లో 67 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. నికోలస్ పురన్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. కానీ మిడిల్ గ్రౌండ్ లో నిగ్రహం కోల్పోయినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

Advertisement

హర్షదీప్ సింగ్ వేసిన రెండవ ఓవర్లో నికోలస్ పురన్ ను ఎంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే ఎంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టిన పూరణ్ రివ్యూ తీసుకొని నాట్ అవుట్ గా నిలిచాడు. ఎల్బీ కాదని తెలిసిన ఎంపైర్ ఎల్బీ గా ప్రకటించి అవుట్ ఇవ్వడంతో నికోలస్ పురన్ నిగ్రహం కోల్పోయాడు. ఈ క్రమంలో నికోలస్ పురన్ ఎంపైర్ ను దూషించాడు. దీంతో ఎంపైర్ మ్యాచ్ రిఫరికి ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ రిఫరీ ముందు నికోలస్ పురన్ తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఆటగాడికి భారీ జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 15% కోత విధించారు.

Advertisement

అలాగే తన బిహేవియర్ కు గాను ఓ డీ మెరిట్ పాయింట్ దక్కింది. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్ సిరీస్ లో వెస్టిండీస్ రెండు మ్యాచ్లు గెలిచింది. మరో మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ ను సొంతం చేసు కుంటుంది. తోలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆగస్టు 8న సిరీస్ డిసైడ్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading