Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం లభిస్తుంది

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం లభిస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ వారం అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

Weekly Horoscope in Telugu 03.03.2023 నుంచి 09.03.2024 వరకు మేషం :

నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకావం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి

Weekly Horoscope in Telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరత్వం లభించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి జీవితంలో వేగం, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు.

Weekly Horoscope in Telugu : సింహం

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండు తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసు కుంటాయి. బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి. వృత్తి జీవి తంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి.

Weekly Horoscope in Teluguతుల

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మంచి మార్పులు తలపెడతారు. ఏ విషయంలోనైనా ఆలో చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు కూడా ఊపందు కుంటాయి. లాభసాటిగా ముందుకు వెడతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

Weekly Horoscope in Teluguమకరం

వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

Weekly Horoscope in Teluguకుంభం

 వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading