Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. వారి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. వారి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి

by Anji

Weekly Rasi Phalau in Telugu 2023 : మేష రాశి వారికి ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 19.11.2023 నుంచి 25.11.2023 వరకు మేషం :

Mesha

Mesha

వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. అధికంగా సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉందని భావించవచ్చు. ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.  

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కలిసి వస్తుంది. తండ్రి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. వారమంతా చాలావరకు ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వ్యవహారాలను, కొన్ని పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

 

ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

 ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. 

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

వ్యాపా రాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నా లకు చాలా కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధికి అను కూలమైన వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

 

ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి రావచ్చు. శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత విషయాల్లో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలిన్నాటి శనితో పాటు, కుటుంబ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారతాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయా సంగా పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading