Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించడం గ్యారెంటీ..!

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించడం గ్యారెంటీ..!

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మేష రాశి నుంచి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

 

Weekly Horoscope in Telugu 12.11.2023 నుంచి 18.11.2023 వరకు మేషం :

Mesha

Mesha

 

అనుకున్న కార్యాలు సకాలంలో జరుగవు. ఆలోచనలు కాస్త నిలకడగా ఉండవు. కొన్ని ఒప్పందాలు వాయిదా పడుతాయి. మీ వ్యూహాలు కొన్ని తప్పే సూచనలున్నాయి. ఆదాయం తగ్గినా అవసరాలకు ఇబ్బందులు తలెత్తవు. బందువులతో విభేదిస్తారు. కొన్ని బాధ్యతలు పెరిగి సతమతమవుతారు. ఆరోగ్యం కాస్త చిరాకు కలిగిస్తుంది.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉత్సాహంగా కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు.. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

 

దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగిపోతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

ముఖ్యమైన కార్యాలు కొంత నిదానించినా చివరికీ పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలతో పురోగతి కనిపిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది కలుగకుండా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల ఆదరణ పొందుతారు. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన మార్పులు ఉంటాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

 

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు వచ్చే అవకాశముంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదురుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

 

ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావాల్సిన  డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

 

నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహి స్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసు కుంటారు. దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వృత్తి, ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు.  

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading