Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు

by Anji
Published: Last Updated on
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : మేషరాశి వారికి ఈ వారం గ్రహబలం బాగా అనుకూలంగా ఉండటంతో వారం మొత్తం సానుకూలంగానే గడిచిపోతుంది. వృషభరాశి వారికి రెండు, మూడు శుభ గ్రహాలను అనుకూలంగా సంచరిస్తుండటంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి అవుతాయి. మిథునరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటంతో అకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఈ వారం 12 రాశులకి సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 26.11.2023 నుంచి 02.12.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా.. కుటుంబపరంగా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు, విలాసాలకు, దురలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమం. విలాసాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మంచి మిత్రులు పరిచయమవుతారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యో గంలో ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం.. దుష్ప్రచారం సాగించడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడు తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి.  వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో అతి జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు కానీ.. విలువైన వస్తువులు గానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలోనే కాక, కుటుంబపరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. సంతానం నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలకు, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

వ్యక్తిగత సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. ఇక ఉద్యోగంలో కూడా బాగా శ్రమ ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడమో, లక్ష్యాలను పెంచడమో జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆహార, విహా రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం పెరిగి, కొద్దిగా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. తోబుట్టువు లతో సఖ్యత బాగా పెరుగుతుంది. కొత్తవారు పరిచయం అవుతారు. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా మారతాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు, సాఫీగా సాగిపోతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగంలోనే కాక, కుటుం బానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. తొందరపాటుతో వ్యవహ రించవద్దు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి దానం తటదే పరిష్కారం అవుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల, సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading