Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఈ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఈ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 05.03.2023 నుంచి 11.03.2023 వరకు మేషం :

Mesha

Mesha

ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో రోజు రోజుకు ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అధికంగా లాభాలుంటాయి. మనసులో అనుకున్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గరి వారి సూచనలు పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

దృష్టవంతులు అవుతారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి వస్తారు.  గృహ, భూ యోగాలుంటాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ముందుకెళ్తే కష్టాలు తొలగుతాయి. ఆపదలు పొంచి ఉన్నాయి. తెలివితేటలతో అధిగమించాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మిత్రులకు అండ చాలా అవసరం. వివాదాల జోలికి అస్సలు పోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఓ సమస్యను ఇంట్లో వారి సూచనలతో అధిగమించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితముంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.  మీ యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. విజయం లభిస్తుంది. న్యాయబద్ధంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. స్వయం  కృషితో పైకి వస్తారు. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. నలుగురిని కలుపుకొని పోవాలి. మన పని మనం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలి. దగ్గరివారితో విభేదాలు తలెత్తుతాయి. అనవసర ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

ఉద్యోగంలో అధికార లాభం కలిగే అవకాశముంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి పని పూర్తి అవుతుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సకాలంలో విజయవంతంగా పని పూర్తి చేయాలి. మిత్రబలం చాలా అవసరం. ఆటంకాలు తొలగిపోతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలుంటాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయకండి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సకాలంలో బాధ్యతలను నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నమ్మకంగా ముందుకు వెళ్లాలి. దగ్గరి వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో శుభఫలితం ఉంటుంది. క్రమక్రమంగా పైకి వస్తారు. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుకున్నది సాధిస్తారు. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించకూడదు. ఆస్తి పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. సంపద రోజు రోజుకు పెరుగుతుంది. గృహ నిర్మాణ విషయాల్లో పురోగతి సాధిస్తుంది. సాహసనిర్ణయాలు కలిసి వస్తాయి. మీకు ఎప్పటినుంచో ఉన్న అపోహలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

మనోబలంతో పనిని ప్రారంభించండి. అపోహలకు అస్సలు తావివ్వకండి. స్థిరమైన ఉద్యోగం సాధిస్తారు. నిర్ణయానికి కట్టుబడి ఉండండి.  శత్రుదోషం ఉంటుంది. నిరంతర సాధనతో ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు. పని మధ్యలో అస్సలు ఆపకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగఫలితం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరిగా ఉంచాలి. ప్రణాళిక ప్రకారం.. పని చేయాలి. బుద్ధిబలంతో అధిగమించాలి. ధైర్యంగా మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించండి. వివాదాల జోలికి పోకూడదు. కుటుంబ సభ్యులను సంప్రదించి చేసే పనులను విజయాన్ని ఇస్తాయి.

Visitors Are Also Reading