Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం కలుగుతుంది

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం కలుగుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu మేష రాశి వారికి ఈ వారం తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు అధికారులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

Weekly Horoscope in Telugu 25.02.2023 నుంచి 02.02.2024 వరకు మేషం :

వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా బలం పుంజుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదరడానికి అవకాశం ఉంది. కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. అనుకున్న పనులన్నిటినీ పూర్తి చేస్తారు.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెర వేరుస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తండ్రితో విభేతాలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వారమతా ఇష్టమైన విధంగా గడిచిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఉద్యోగ వాతావరణం చాలావరకు సానుకూలంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగి పోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.

Weekly Horoscope in Telugu : సింహం

ఆకస్మిక ధనలాభానికి కూడా అవ కాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

Weekly Horoscope in Telugu కన్య

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు లాభ దాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

వృత్తి, ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. అధికారులకు బాగా దగ్గరవుతారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

ముఖ్యమైన పనులు, వ్యవహారాలను ఒంటి చేత్తో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకు న్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి.

Weekly Horoscope in Teluguమకరం

ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సానుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి సాధిస్తాయి.

Weekly Horoscope in Teluguకుంభం

కొన్ని అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలు తలపెడతారు. స్థిరాస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

ఆకస్మిక ధన లాభానికి, ఊహించని పురోగతికి అవకాశం ఉంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చుల నుంచి బయటపడతారు. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading