Home » మ్యాచ్ కంటే ముందే మొదలైన ఇండియా – ఇంగ్లాండ్ వార్… ఎలా అంటే…?

మ్యాచ్ కంటే ముందే మొదలైన ఇండియా – ఇంగ్లాండ్ వార్… ఎలా అంటే…?

by Azhar
Ad

ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడటంతో దానిని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ తో మూడు టీ20లు మూడు వన్డేలు కూడా ఆడనుంది భారత జట్టు. అయితే ఈ రెండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జులై 1న ప్రారంభం కానుంది. కానీ అంతకంటే ముందే ఇండియా – ఇంగ్లాండ్ వార్ అనేది ప్రారంభమైంది. అది గ్రౌండ్ లో కాదు.. ట్విట్టర్ లో. ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

Advertisement

అలాగే మన ఇండియాలో కూడా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ కూడా ఏం తక్కువ కాదు. మన జట్టు గురించి మైఖేల్ వాన్ ఏం మాట్లాడిన దానికి పంచ్ ఇస్తూ ఉంటాడు జాఫర్. అయితే తాజాగా జాఫర్ తన ట్విట్టర్ లో లార్డ్స్ మైదానంలో కూర్చునా ఫోటోను పోస్ట్ చేసాడు. దానికి మైఖేల్ వాన్ సైలెంట్ గా ఉండకుండా… నేను తొలిసారి టెస్టులో నిన్ను ఇక్కడ ఔట్ చేసిన దానికి గుర్తుగా ఇక్కడికి వచ్చావా అని ప్రశ్నిస్తూ కామెంట్ చేసాడు. వాన్ కామెంట్ చుసిన జాఫర్ ఎందుకు సైలెంట్ గా ఉంటాడు.

Advertisement

2007 లో టీం ఇండియా లార్డ్స్ లో గెలిచిన టెస్ట్ సిరీస్ ఫోటోను షేర్ చేస్తూ.. లేదు ఈ సిరీస్ గెలిచి 15 ఏళ్ళు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చాను రిప్లయ్ ఇచ్చాడు. దాంతో వాన్ సైలెంట్ అయిపోయాడు. ఇక వీరి మధ్య జరిగిన ఈ ట్విట్టర్ వార్ ను చూసి ఫ్యాన్స్ మాత్రం ఖుషి అవుతున్నారు. నిద్ర పోతున్న సింహాని లేపితే ఇలానే ఉంటుంది అని మైఖేల్ వాన్ కు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇండియా – ఇంగ్లాండ్ మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో.. మన జట్టు గెలిచినా.. కనీసం ఈ మ్యాచ్ ను డ్రా చేసినా కూడా సెయిస్ మనదే అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి కరోనా పాజిటివ్ నిజమే.. కానీ…?

ఫీల్డర్ కావాలనే బాల్ ను బౌండరీ బయటకు వేస్తే ఏం చేస్తారో తెలుసా..?

Visitors Are Also Reading