వానా కాలంలో బట్టలు ఆరవు. ఉతికిన బట్టలు అలా ఆరకపోవడంతో వాటి నుండి దుర్వాసన వస్తుంది వానాకాలంలో బట్టల దుర్వాసనని పోగొట్టాలంటే ఇలా చేయండి. ఇలా చేయడం వలన బట్టల నుండి సువాసన వస్తుంది. దుర్వాసన రాదు. వానా కాలంలో ఉతికిన బట్టలు ఎండలో అరకపోతే కచ్చితంగా దుర్వాసన వాటి నుండి వస్తుంది. బట్టల నుండి వచ్చే ఆ వాసన చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే వానా కాలంలో బట్టలు ఆరకపోతే వాటిని ఫ్యాన్ గాలిలో ఆరబెడుతూ ఉంటారు.
Advertisement
Advertisement
కొంతమంది వాషింగ్ మిషన్ డ్రయర్ లో వేసి ఆరబెట్టేస్తుంటారు అయితే వర్షాకాలంలో బట్టలు నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. బట్టలు ఉతికేటప్పుడు బకెట్ లోని నీటిలో కొంచెం నిమ్మ తొక్కల్ని వేయండి. దానితో బట్టల్ని ఉతికి ఆరబెడితే దుర్వాసన రాదు. నిమ్మరసం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాని చంపేస్తుంది. బట్టల నుండి చెడు వాసన రాకుండా ఉండాలంటే వెనిగర్ ని కూడా వేయండి. బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్ళల్లో ఒక చెంచా వెనిగర్ ని వేయండి. బట్టలు ఆ నీటిలో ముంచి ఉతికితే దుర్వాసన రాకుండా ఉంటుంది డిటర్జెంట్లు చాలా అందుబాటులో ఉంటున్నాయి. వాటినైనా వాడొచ్చు బేకింగ్ సోడా వేస్తే కూడా బట్టల నుండి దుర్వాసన రాదు.
Also read:
- ఆరోగ్యానికి పసుపు మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ నష్టాలు తప్పవు..!
- శ్రావణ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఇవి కలిపితే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.. !
- ఐరన్ లోపం తో బాధ పడుతున్నారా..? వీటిని తీసుకోండి మరి..!