ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. అనే విధంగా తయారయింది సమాజంలో అమ్మాయిల పరిస్థితి. అది ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం మహిళలపై ఏదో ఒక చోట అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మగ మృగాలు రెచ్చిపోతూ కామంతో కళ్లు మూసుకుపోయి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూడా
Advertisement
మహిళలను వేధింపులకు గురిచేస్తూ, వారి వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వీటిపై మహిళా చట్టాలు ఎన్ని తీసుకొచ్చిన ఎన్ని శిక్షలు ఖరారు చేసిన ఆకతాయిలలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆకతాయిలకు చెక్ పెట్టే ఈ విధంగా అడుగులు వేస్తున్నది. అమ్మాయిలను అదేపనిగా చూస్తే జైలు శిక్ష ఖాయమని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. లండన్లోని
Advertisement
మెట్రో స్టేషన్ ఇతర బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టడం కోసం బ్రిటన్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే అమ్మాయిలను చాలా సేపు అదేపనిగా చూస్తే జైల్లోకి పంపిస్తామని సర్క్యులర్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారన్న మురళీమోహన్.. ఆ సీన్ వల్లేనా..!!
Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?