Home » ఓటీటీలోకి ‘వ్యూహం’.. ఈ తెలుగు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘వ్యూహం’.. ఈ తెలుగు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

by Anji
Ad

ప్రస్తుతం ఓటీటీ వెబ్ సిరీస్ లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎక్కువగా హిందీలోనే వచ్చే ఈ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం తెరకెక్కుతున్నాయి. తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తుంటే, స్టార్ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్, రెక్కీ, లేటెస్ట్ గా దూత వెబ్ సిరీస్ లు తెలుగు ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఈ కోవలోనే మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ రానుంది. అదే వ్యూహం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్ధంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్ డిసెంబర్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక వ్యూహం వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. న్యాయం కోసం అతను చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు, నిత్యం వేటాడే గతం, ఇలా ఆసక్తికర అంశాలతో వ్యూహం వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. కాగా నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 240 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంటుంది. వ్యూహం కూడా ఇదే కోవలోకి వస్తుందని, ప్రేక్షకులు ఊహించని మలుపులు ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading