టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరు వివివినాయక్. ఆయన తొలుత ఆది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత దిల్, చెన్నకేశవరెడ్డి, సాంబ, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, అదుర్స్ వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరకెక్కించారు. మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో వినాయక్ దిట్ట అనడంలో ఎలాంటి అతివయోక్తి లేదు. ముఖ్యంగా ఆది, దిల్, బన్నీ వంటి సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతల వారసులను సినిమాల్లోకి తీసుకురావడం సర్వసాధారణమే. ఇలా వినాయక్ ఇద్దరు వారసులను లాంచ్ చేశాడు. అందులో ఒకరు నాగార్జున తనయుడు అఖిల్, మరొకరు బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
Advertisement
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ అఖిల్. వివివినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పాలి. సాధారణ సినీ ప్రేక్షకుడికే కాదు అక్కినేని అభిమానులకు కూడా ఈ మూవీ నచ్చలేదట. ఈ సినిమా పరాజయానికి తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నాడు వినాయక్. ఈ సినిమా ఒక పెద్ద హీరో కొడుకుతో తీస్తున్నాను కాబట్టి ఎంట్రీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకున్నాను. కథ విషయం గురించి ఆలోచించలేదని చెప్పాడు. కథ అనుకున్నది అనుకున్న విధంగా తీసి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు వినాయక్.
Advertisement
ఇక పెద్ద హీరో కొడుకు అయినా సరే మాత్రాన తొలి సినిమా సింపుల్ గా ఓ లవ్ స్టోరీ మాదిరిగా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయంలో సక్సెస్ అయ్యాను అంటూ తన తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం వినాయక్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీలో చత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్స్ బాగా చేయాలని అనుకుంటున్నట్టు వినాయక్ వెల్లడించారు. వినాయక్ తీసే ఈ సినిమా ఫలితం ఏవిదంగా ఉంటుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read :
హీరోయిన్ కళ్యాణితో దర్శకుడు సూర్యకిరణ్ విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..?
తెలుగు ఇండస్ట్రీలో ఈ 10 మంది ప్రముఖులు బంధువులని మీకు తెలుసా..?