ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ తన నటన మరియు ఆటిట్యూడ్ తో విశ్వక్ సేన్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరవాత ఫలక్ నమా దాస్, హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కల్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
ఈ సినిమాలో విశ్వక్ సేన్ చేసిన పాత్ర ఇదివరకు చేసిన సినిమాల కంటే పూర్తి డిఫరెంట్ గా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన పెట్రోల్ ప్రాంక్ రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంక్ పై టీవీ 9 ఛానల్ డిబేట్ ను నిర్వహించింది. డిబేట్ లో యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ను పాగల్ సేన్…డిప్రెసిడ్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది. దాంతో విశ్వక్ సేన్ నేరుగా స్టూడియోకు వెళ్లి హంగామా చేశాడు. దేవినాగవల్లిని ఎఫ్ పదంతో దూషించాడు.
Advertisement
మరోవైపు దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ను గెట్ అవుట్ అంటూ అవమానపర్చింది. ఇక ఈ వివాదం చిరిగిచిరిగి గాలి వానంత అయ్యింది. దేవి నాగవల్లి పలువురు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. మరోవైపు విశ్వక్ సేన్ కు టాలీవుడ్ నుండి కొందరు సపోర్ట్ అందించారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై బాబుగోగినేని స్పందిస్తూ మెంటల్ యాక్ట్ గురించి ఓ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ లో హైకోర్టు న్యాయవాది ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….మెంటల్ హెల్త్ యాక్ట్ ను ఉల్లంగించడం అనేది క్షమించరాని నేరం దానికి 2 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది. నటుడిని టీవీ ఇంటర్వ్యూకి పిలిచి డిప్రెసిడ్ పర్సన్ మానసిక రోగి అని పిలవడం నేరం. దేవి నాగవల్లి అతడి మానసిక ఆరోగ్యాన్ని నిర్దారించకుండా మానసిక రోగి అని పిలుస్తూ ఆరోగ్యపరిస్థితి గురించి మాట్లాడటం అతడి గౌరవానికి సంబంధించింది. వైద్య చికిత్స కోసం తప్ప మరెక్కడా ఇలాంటి వివరాలను వెల్లడించవద్దు అంటూ బాబుగోని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ALSO READ :
విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన బాబుగోగినేని….!
ఎన్టీఆర్ అనుష్క కలిసి నటించాల్సిన ఆ క్రేజీ ప్రాజెక్ట్..మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..!