Home » జీవితంలో నాకు ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు…కంట‌త‌డి పెట్టుకున్న విశ్వ‌క్ సేన్..!

జీవితంలో నాకు ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు…కంట‌త‌డి పెట్టుకున్న విశ్వ‌క్ సేన్..!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. విశ్వ‌క్ సేన్ హీరోగా ప్ర‌స్తుతం అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విశ్వ‌క్ సేన్ తాజాగా స‌న్నీ హీరోగా న‌టిస్తున్న ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈవెంట్ లో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ…తాను సినిమా అవ‌కాశాల కోసం చాలా ఆఫీస‌సుల చుట్టూ తిరిగాన‌ని చెప్పారు.

vishweksen

vishweksen

ఓ ఏడెనిమిది ఆఫీసుల్లో తన‌కు రెండు నెల‌ల వ‌ర‌కూ అవ‌కాశం ఉంద‌ని చెప్పేవార‌ని ఆ త‌ర‌వాత మ‌ళ్లీ వెళితే ఛాన్స్ లేద‌ని చెప్పేవార‌ని అన్నారు. అలాంటి స‌మ‌యంలో ఎవ‌రైనా స‌పోర్ట్ చేస్తే బాగుండేద‌ని అనిపించేద‌ని చెప్పాడు. అలాంటి స‌మ‌యంలో నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ త‌రుణ్ భాస్కర్ త‌న‌కు హీరోగా అవ‌కాశం ఇచ్చాడ‌ని హీరోను చేశాడ‌ని విశ్వ‌క్ సేన్ ఎమోష‌నల్ అయ్యారు. తాను చేసిన నాలుగైదు సినిమాల్లో త‌న‌కు అవ‌కాశం ఉంటే ఇత‌రుల‌కు అవ‌కాశం ఇచ్చేవాడిన‌ని చెప్పారు.

Advertisement

Advertisement

తాను బిగ్ బాస్ చూసేవాడిన‌ని కానీ బిగ్ బాస్ హౌస్ లో ఫైట్ చేసుకున్న రోజు మాత్ర‌మే చూసాన‌ని చెప్పాడు. త‌న ఫ్రెండ్ పూర్తిగా వంద ఎపిసోడ్ లు చూసేవాడ‌ని అత‌డు ఎప్పుడు కొట్టుకున్నారో చెబితే ఆ రోజు మాత్ర‌మే చూసేవాడిన‌ని చెప్పాడు. స‌న్నీ హౌస్ లో జెన్యూన్ గా ఫైట్ చేశాడ‌ని అందుకే స‌పోర్ట్ చేశాన‌ని విశ్వ‌క్ సేన్ చెప్పారు. అంతే కాకుండా త‌న వ‌ద్ద‌కు ఏమైనా మంచి క‌థ‌లు వ‌స్తే వాటిని స‌న్నీ వ‌ద్ద‌కు పంపిస్తాన‌ని చెప్పారు.

Visitors Are Also Reading