Home » Vishwambhara: అందుకే మెగాస్టార్ అనేది.. చిరు డెడికేషన్‌కి విశ్వంభర టీమ్ షాక్..!

Vishwambhara: అందుకే మెగాస్టార్ అనేది.. చిరు డెడికేషన్‌కి విశ్వంభర టీమ్ షాక్..!

by Sravya
Ad

Vishwambhara’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా రాబోతోంది. విశ్వంభర సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బింబిసారా దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాదు శివారులో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హై యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నుండి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీలో కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలకి బాడీ డబుల్ ఉపయోగించడానికి చిరంజీవి ఒప్పుకోలేదని తెలుస్తోంది.

 డూప్ ని ఉపయోగించమని చెప్పినా చిరంజీవి వినకుండా ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నటించారని యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. 68 ఏళ్ల వయసులో షూటింగ్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా విశ్వంభర సినిమా షూటింగ్ లో చిరంజీవి తీరు చూసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరంజీవి అంటే ఇంతే అని పోస్ట్లు కూడా పెడుతున్నారు. ఎంఎం కీరవాణి విశ్వంభర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Advertisement

Also read:

Advertisement

Also read:

ఈ మూవీలో ఇషా చావ్లా, సురభి రమ్య పసుపులేటి తో పాటుగా పలువురు యంగ్ బ్యూటీస్ కూడా యాక్ట్ చేస్తున్నారు. రావు రమేష్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా చిరంజీవి కెరీర్ లోనే టాప్ ఫైవ్ సినిమాల్లో ఈ సినిమా నిలుస్తుందని అంతా అంటున్నారు. సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు ఇష్టపడేలా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫోటోల్లో హనుమాన్ విగ్రహం ఎక్కువగా ఉంటోంది. మరి కథ ఎలా ఉండబోతుందో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-has-denied-using-a-body-double-for-key-action-scenes-in-the-vishwambhara/articleshow/109329399.cms

Visitors Are Also Reading