గత రెండు రోజులుగా బాలకృష్ణ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కూడా. నటుడు విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు బాలయ్య వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మందు బాటిల్ తో అక్కడికి వచ్చారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంజలిని బ్యాడ్ టచ్ చేసారని స్టేజ్ పై అందరి ముందు తనని వెనక్కి తోయడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో ఏకంగా బాలయ్య వ్యవహారం మీద నేషనల్ మీడియా కూడా స్పందించి వార్తలు రాసింది.
Advertisement
విపరీతంగా నెగటివ్ రోల్స్ కూడా వచ్చాయి. బాలయ్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో అంజలి స్పందించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అలాగే విశ్వక్సేన్ కూడా ఈ వివాదం పై స్పందించారు. అంజలి ఈ ఘటన పై స్పందిస్తూ బాలయ్యకే తన మద్దతు అని పోస్ట్ చేశారు.
Advertisement
Also read:
Also read:
ఈ విషయం గురించి విశ్వక్సేన్ మాట్లాడుతూ అమ్మాయికే లేని ఫీలింగ్స్ మీరు తెప్పించారు అని అన్నారు. ఉద్వేషాన్ని ఆపండి. నెగిటివిటీ కాకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి చూడండి. మా టీం గోల్డ్. చూసే కళ్ళు మంచివి అయితే చాలు. మా బాలయ్య బంగారం ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టికెట్లు బుక్ చేసుకోండి అని స్పందించారు. ప్రస్తుతం విశ్వక్సేన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!