ఈ మధ్య కాలంలో ఓ సినిమా హిట్ అయ్యింది అంటే దానికి సీక్వెల్ అనేది తీస్తూ వస్తున్నారు. ఒకవేళ హిట్ కాకపోతే దానిని అక్కడే ఆపేస్తున్నారు. అయితే హిట్ అయిన సినిమా అనే దానికి సీక్వెల్ అనేది వస్తుంటే.. మొదటి దానిలో ఏ హీరో చేసాడో మళ్ళీ అదే హీరో ఈ సీక్వెల్ లో కూడా నటిస్తాడు.
Advertisement
కానీ విశ్వక్ సేన్ హీరోగా గిట్ పేరుతో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ అనేది వస్తుంది. హిట్ 2 గా వస్తున్న ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. కానీ తాజాగా ఈ విషయంపై హిట్ దర్శకుడు శైలేష్ కొలను స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. హిట్ 2 లో శేష్ ను హీరోగా చుసిన తర్వాత మొదట అందరూ షాక్ అయ్యారు. అలాగే కొందరు నన్ను తిట్టారు అని చెప్పారు.
Advertisement
అయితే హిట్ సినిమాలో విశ్వక్ పాత్ర పేరు విక్రమ్ రుద్రరాజు. ఇక ఈ హిట్ 2 లో ఉండే శేష్ పేరు కృష్ణ దేవ్. కానీ ఈ సినిమాలో కూడా విశ్వక్ ఉంటాడు. ఈ సినిమాలో పోలీసులు అందరూ కలిసి కేస్ ను సాల్వ్ చేసిన సమయంలో విశ్వక్ పాత్రకు సంబంధించిన కేసును కూడా వారు చేధిస్తారు అని దర్శకుడు శైలేష్ కొలను పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :