Home » సూర్య వీక్ నెస్ పై ప్లాన్ జరుగుతున్నాయా..?

సూర్య వీక్ నెస్ పై ప్లాన్ జరుగుతున్నాయా..?

by Azhar
Ad

భారత జట్టులోకి సూర్య కుమార్ యాదవ్ చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి ఇప్పటివరకు సూర్య తన మార్క్ ను చూపిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా తన ఫామ్ అనేది కోల్పోకుండా.. ప్రస్తుతం ఇండియా జట్టులో టాప్ టీ20 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో కూడా బాగానే రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ వీక్ నెస్ పైన ప్లాన్స్ అనేవి జరుగుతున్నట్టు.. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ మాటలను బట్టి అర్ధం అవుతుంది. తాజాగా స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. సూర్య వీక్ నెస్ అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అతను గ్రౌండ్ లోకి రావడంతోనే హిట్టింగ్ అనేది ప్రారంభిస్తాడు.

Advertisement

తాను ఎలాంటి షాట్స్ ఆడాలి అనేది అతను గ్రౌండ్ బయటే డిసైడ్ అవుతాడు. ఇక వచ్చిన తర్వాత అచ్చం అలాగే ఆడుతాడు. బౌన్సర్లు వేసిన.. యార్కర్లు వేసిన బంతిని గ్రౌండ్ బయటకు పంపిస్తాడు. అలాంటి సమయంలో బౌలర్లు కూడా తన బ్యాటింగ్ చూస్తూ నిలుచోవడం తప్ప ఏం చేయలేరు అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు అందరూ సూర్య బ్యాటింగ్ గురించి మాట్లాడితే స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం అతని వీక్ నెస్ గురించి మాట్లాడటం అనేది అందరికి ఆచార్యం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి :

క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన ఇండిగో..!

మాకు ప్రపంచ కప్ వద్దు.. ఇండియాను కూడా గెలవనివ్వం..!

Visitors Are Also Reading