Home » GAAMI MOVIE REVIEW IN TELUGU : విశ్వక్ సేన్ గామి రివ్యూ.. ఎలా ఉందంటే..?

GAAMI MOVIE REVIEW IN TELUGU : విశ్వక్ సేన్ గామి రివ్యూ.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి.  కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు.  ఇటీవలే విడుదలైన ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.  సరికొత్త కథతో వస్తున్న గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా  ఇవాళ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కథ మరియు విశ్లేషణ : 

అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అఘోర ( విశ్వక్ సేన్). ఇతర మనుషులకు అతడు తాకలేడు. మానవుల స్పర్శ వల్ల అతని శరీరం రోగగస్త్రం అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంటుంది. 36 ఏళ్లకు ఒకసారి హిమాలయాల్లో పూసే పువ్వులు కావాలి. ఆ పూల కోసం గాయపడిన శరీరంతో అఘోర మంచు కొండల మధ్య సాహస యాత్రకు పూనుకుంటాడు. అతని లక్ష్యం నెరవేరిందా..? ఆ సమస్య నుంచి బయటపడ్డాడా..? అసలు ఈ అఘోర నేపథ్యం ఏంటి..? ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని థియేటర్లలో వీక్షించాల్సిందే.

Advertisement

ముఖ్యంగా అఘోర పాత్రలో విశ్వక్ సేన్ నటన అద్భుతమనే చెప్పాలి. విజువల్స్ హైలెట్.  ఈ సినిమా అందరికీ ఎక్కుతుందా? లేదా? అన్నది చెప్పలేను గానీ.. రెండో సారి కాస్త ఓపికతో చూస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది..విశ్వక్ సేన్ యాక్టింగ్, అఘోరాలా ఎంట్రీ సీన్.. టైటిల్ రివీల్, సౌండ్ డిజైన్ ఇలా అన్నీ బాగున్నాయి.  సెకండాఫ్ యావరేజ్‌గా ఉంది.. స్టోరీ లైన్ అద్భుతంగా.. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది.. సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాలే కాపాడేస్తుంది. స్ట్ హాఫ్ అందరినీ మెప్పిస్తుంది..అయితే సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది.. అదొక్కటీ పక్కన పెడితే.. టాప్ నాచ్ విజువల్స్.. సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి.  స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.

పాజిటివ్ పాయింట్స్ : 

  • విశ్వక్ సేన్ నటన
  • కాన్సెప్ట్
  • క్లైమాక్స్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • విజువల్స్

మైనస్ పాయింట్స్ : 

  • సెకండాప్ స్లోగా సాగడం
  • మాస్ ప్రేక్షకులను ఆకర్షించకపోవడం

రేటింగ్ : 3/5 

Also Read : సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ ‘లవ్ స్టోరీ’ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading