Home » “రంగ‌రంగ‌వైభ‌వంగా” అంటూ వ‌చ్చిన‌ వైష్ణ‌వ్ తేజ్…!

“రంగ‌రంగ‌వైభ‌వంగా” అంటూ వ‌చ్చిన‌ వైష్ణ‌వ్ తేజ్…!

by AJAY
Ad

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. డిఫ‌రెంట్ క‌థ‌తో వ‌చ్చిన ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో వైష్ణ‌వ్ తేజ్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న రెండ‌వ సినిమా కొండ‌పొలం ను విడుద‌ల చేశాడు. ఈ సినిమా అనుక‌న్నమేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం త‌న మూడో సినిమాను ప‌ట్టాలెక్కించాడు. వైష్ణ‌వ్ తేజ్ రంగ‌రంగ‌వైభవంగా అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సినిమాకు రంగ‌రంగ‌వైభ‌వంగా అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖ‌రారు చేయ‌గా పోస్ట‌ర్ రొమాంటిక్ గా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading