ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెట్ లో ఆటగాళ్లకు మాత్రమే కాకుండా కొంత మంది అంపైర్ల కూడా మంచి పేరు ఉంటుంది. బిల్లీ బౌడెన్ అందులో ముఖ్యమైనవాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ కూడా ఆ లిస్ట్ కు చెందినవాడే. మన యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు అక్కడ అంపైరింగ్ చేస్తుంది అతనే. ఇప్పుడు తాజాగా అతను దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీతో కలిసి ఆన్‌లైన్ అంపైరింగ్ కోర్సులను ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సైమన్ టౌఫెల్ మాట్లాడుతూ.. టీం ఇండియా టాప్ ప్లేయర్స్ వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు అంపైరింగ్ లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Advertisement
Advertisement
ఎందుకంటే నేను అంపైరింగ్ చేస్తున్నప్పుడు సెహ్వాగ్ నా పక్కకు ఉండి ఏది ఔట్.. ఏది నాట్ ఔట్ అనేది ముందే చెప్పేవాడు. అతనికి క్రికెట్ రూల్స్ పైన పట్టుకూడా బాగే ఉంటుంది. అని చెప్పాడు. నేను ఈ విషయం అతనికి కూడా చెప్పను. కానీ సెహ్వాగ్ లేదు అని చెప్పాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఆటగాడు మోర్నీ మోర్కెల్ గురించి చెప్తూ… అతను క్రికెట్ తర్వాత అంపైరింగ్ తీసుకోవడానికి చాలా అనుకున్నాడు… కానీ కుదరలేదు. ఎందుకంటే ఈ అంపైరింగ్ అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ పనిలో మ్యాచ్ మొత్తం క్రీజులో నిలబడి ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తూ సరైన నిర్ణయాలు ఇవ్వాలి.
అయితే సెహ్వాగ్ తో పాటుగా ఈ అంపైరింగ్ కు కోహ్లీ అలాగే అశ్విన్ కూడా బాగా పనికి వస్తారు. ఎందుకంటే వీరిద్దరికి క్రికెట్ రూల్స్ పైన చాలా పట్టు ఉంది. అందువల్ల వీరు ఇందులో బాగా పనిచేయగలను అని అన్నారు. అయితే ప్రస్తుతం సైమన్ టౌఫెల్ ఐపీఎల్ 2022 లో అంప్రింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఒకవేళ నిజంగానే కోహ్లీ, అశ్విన్ అంపైర్లుగా మారితే ఎలా ఉంటుందో మరి..!
ఇవి కూడా చదవండి :