Home » బాబర్ ఆజమ్ కోహ్లీతో సమానం అంటున్న దినేష్ కార్తీక్…

బాబర్ ఆజమ్ కోహ్లీతో సమానం అంటున్న దినేష్ కార్తీక్…

by Azhar
Ad

ప్రపంచ క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లు ఉన్న అందులో కొంత మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అటువంటి ఆటగాళ్లు ఉండటం చాలా అరుదు. అందులో మన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడు. కోహ్లీ పారించిన పరుగుల వరద అనేది మాములుగా లేదు. అందులో ఎన్నో రికార్డులు కొట్టుకుపోయాయి. అయితే జనాలు ఎక్కువగా కోహ్లీని అలాగే పాకిస్థాన్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ అయిన బాబర్ ఆజమ్ ను పోలుస్తూ ఉంటారు. బాబర్ ను చూస్తుంటే కోహ్లీని చూసినట్లే అనిపిస్తుంది అని కామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు. అందులో అందరూ విదేశీ ఆటగాళ్లే. కానీ ఇప్పుడు మొదటిసారి మన ఇండియాకు చెందిన దినేష్ కార్తీక్ కూడా బాబర్ ఆజమ్ కోహ్లీతో సమానం అంటూ కామెంట్స్ చేసాడు.

Advertisement

తాజాగా ఐసీసీ రివ్యూ షోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… బాబర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ఉన్న ఆటగాడు. అతను చాలా ప్రత్యేకం. తన బ్యాటింగ్ తో దానిని మరింత పైకి తీసుకెళ్లాడు. పాక్ లో బాబర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే అతను మూడు ఫార్మట్స్ లో బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. ఇప్పటివరకు మనం విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ నలుగురిని కలిపి ఫ్యాబ్ 4 అని పిలుస్తున్నం. ఎందుకంటే వారి బ్యాటింగ్ వారిని ఆ రేజ్ లో ఉంచింది. కానీ నేను తప్పకుండ చెబుతున్నాను. బాబర్ దానిని ఫ్యాబ్ 5 గా మార్చేస్తాడు. అతనికి ఆ సత్తా ఉంది.

Advertisement

బాబర్ తప్పకుండ భవిష్యత్తులో కోహ్లీకి సమానంగా నిలుస్తాడు. ఎందుకంటే బాటింగ్ సమయంలో అతని బ్యాలెన్స్ అలాగే బంతిని అతను కొట్టే విధానం బహున్తీ. ఫ్రంట్ ఫుట్ అయినా బ్యాక్ ఫుట్ అయినా ఆడగల సామర్థ్యం బాబర్ కు ఉంది. మనం ఇంటర్నేషనల్ లెవల్ లో ఆడుతున్నప్పుడు మన టెక్నీక్ ను డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లను మనల్ని సులువుగా పట్టేస్తారు. బాబర్ కూడా ఇంకా విజయవంతం కావాలంటే దీని పైన ఫోకస్ చేయాలి. అలా చేస్తే అతను ఇనాక్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలడు అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

RCB ని టైటిల్ పోరులో నిల‌బెట్టిన ఈ పాటిదార్ ఎవ‌రు? ఈ సిక్స్ మ్యాచ్ కే హైలెట్!!

Visitors Are Also Reading