Home » విరాట్ కోహ్లీ పదోతరగతి మార్కుల మెమో మీరు చూశారా ? ఎన్ని మార్కులు వచ్చాయంటే..?

విరాట్ కోహ్లీ పదోతరగతి మార్కుల మెమో మీరు చూశారా ? ఎన్ని మార్కులు వచ్చాయంటే..?

by Anji
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో క్రేజీ మామూలుగా ఉండదు. అతను ఏ చినన విషయాన్ని అయినా సరే పోస్ట్ చేయగానే అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఐపీఎల్ కు వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 16 సీజన్ లో ఆడేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే 2008లో ఆర్సీబీ జట్టులో  చేరి కెప్టెన్ గా చేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును మాత్రం సాధించలేకపోయాడు. 

Also Read :   డేవిడ్ వార్నర్ ను వదిలేసి… SRH పెద్ద తప్పే చేసిందిగా!

Advertisement

ఐపీఎల్ వచ్చిన ప్రతీసారి విరాట్ సారథ్యంలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ విరాట్ కోహ్లీ చెప్పే ఈసాలా కప్ నమ్ దే అనే స్లోగన్ కూడా ఫేమస్ అయింది. తాజాగా విరాట్ అభిమానులను ఆశ్చర్యపరిచేవిధంగా తన 10వ తరగతికి సంబంధించిన మార్కుల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మార్కుల షీట్ ఫైనా స్పోర్ట్స్ అంటూ అదనపు సబ్జెక్ట్ గా పెట్టాడు. 

Advertisement

Also Read :  ఇండియాలో ఫేస్బుక్, ఇన్ స్టా బ్లూటిక్ కు చార్జీలు… నెలకు ఎంత అంటే?

Manam News

2004లో విరాట్ కోహ్లీ 10వతరగతి పాస్ అయినట్టు మెమోలో కనిపిస్తోంది. ఇంగ్లీషులో 83, హిందీలో 75, మ్యాథ్స్ లో 51, సైన్స్ అండ్ టెక్నాలజీలో 55, సోషల్ లో 81 మార్కులు సాధించాడు. క్రీడల సంగతి ఏంటి అన్నట్టు వదిలేసి తన స్టైల్ లో విరాట్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘మార్కుల జాబితాలో కనీసం చోటు లేని సబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కువ భాగం కావడం విశేషం ఉంది’ అనే కోణంలో రాసుకొచ్చాడు. మార్కుల షీట్ మీద స్పోర్ట్స్ అనే పదం ఉన్న పోస్ట్ ను డిలీట్ చేసిన కోహ్లీ మళ్లీ మెమో షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సంబంధించిన పదోతరగతి మార్కుల మెమో తెగ వైరల్ అవుతోంది. 

 Also Read :  శ్రీరామనవమి రోజు పెట్టే ప్రసాదంలో అంతటి అద్భుత ఔషదం ఉందా ?

Visitors Are Also Reading