భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రేషన్ అనేది అందరికి పరిచయమే. ఎదుట ఉన్నది ఎవరైనా సరే తనకు కోపం తెప్పిస్తే.. అక్కడే ఇచ్చి పడేస్తాడు. గతంలో కూడా మన ఇది చాలా సార్లు చూసాం. కానీ 2017 లో టీం ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అయిన తర్వాత కోహ్లీ తన కోపాన్ని కొంచెం తగ్గించుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ తన పాత పద్ధతికి వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా ఇంగ్లాండ్ లో ఓ అభిమాని కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Advertisement
అయితే ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ లో వార్మప్ మ్యాచ్ అడవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో కొంతమంది భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టులో ఆడుతున్నారు. అందులో భారత యువ ఆటగాడు కమలేష్ నాగర్‌కోటి కూడా ఒక్కడు. అయితే ఈ రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో కమలేష్ నాగర్‌కోటి బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ భారత అభిమాని.. తనకు సెల్ఫీ ఇవ్వాలంట్ గట్టిగా అరుస్తూ అందరికి విసుగు పుట్టిస్తున్నాడు. కానీ అందరి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇదే విషయాన్ని కోహ్లీ గమనించాడు.
Advertisement
దాంతో వెంటనే అక్కడ ఉన్న బాల్కనీలోకి వచ్చి… ఎందుకు ఫీల్డింగ్ చేస్తున్న అతడిని అలా డిస్టర్బ్ చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. దానికి నేను ఇక్కడికి కమలేష్ నాగర్‌కోటి కోసమే వచ్చాను. ఒక్క సెల్ఫీ ఇస్తే ఏం అవుతుంది అంటూ ప్రశ్నించాడు. దానికి కోహ్లీ.. అతను ఇక్కడికి మ్యాచ్ ఆడటానికి వచ్చాడు.. నీతో ఫోటో దిగడానికి కాదు అని సమాధానం ఇచ్చాడు. దాంతో ఆ సదరు అభిమాని సైలెట్ అయిపోయాడు. అయితే దీని మొత్తం అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది. ఇక దీని పై అభిమానులు స్పందిస్తూ.. కింగ్ కోహ్లీ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :