విరాట్ కోహ్లీ, మోస్ట్ పాపులర్ క్రికెటర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో అనుకున్నంతగా ఆడలేకపోతున్న కోహ్లీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో నంబర్ వన్ గానే ఉన్నాడు. భారత క్రికెటర్ల సంపాదనలోనూ ఇప్పటికీ కోహ్లీనే కింగ్.
Advertisement
అటు బీసీసీఐ నుంచి, ఇటు ప్రకటనల ద్వారా కోహ్లీ సంపాదన ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికల్లో ప్రకటనలను ప్రమోట్ చేస్తూ కూడా కోహ్లీ విపరీతంగా ఆర్జిస్తున్నారు. స్పోర్ట్స్ డేటా కంపెనీ బోనస్ ఫైండర్ నివేదిక ప్రకారం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అత్యధిక మొత్తాన్ని సంపాదిస్తున్న ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా, తాజాగా విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Advertisement
కోహ్లీ టీ20 ల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం. అంతర్జాతీయ టి20 మ్యాచ్ ల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కోహ్లీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకున్నప్పటికి సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. వన్డేలు, టెస్టులపై దృష్టి సారించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్వరలోనే క్లారిటీ రానుంది.
READ ALSO : TSPSC : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తోంది !