Home » TSPSC : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తోంది !

TSPSC : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తోంది !

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు.  ఇక ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఖాళీల్లో భూగర్భజల విభాగానికి చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని భూగర్భ జల విభాగానికి చెందిన కింది పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. 06-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2022 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Advertisement

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు,

* నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Advertisement

* వీటిలో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోపిజిసిస్ట్, హైడ్రాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించే డిగ్రీ /మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు,

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,960 నుంచి రూ.1,33,630 వరకు చెల్లిస్తారు.

* 06-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2022తో ముగియనుంది.

READ ALSO : Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

Visitors Are Also Reading