Home » ఇదే ఆటల యొక్క అందం అంటున్న విరాట్..!

ఇదే ఆటల యొక్క అందం అంటున్న విరాట్..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ గురించి అందరికి బాగా తెలిసిందే. ఎంత గొప్ప ఆటగాడైన ఒదిగే ఉంటాడు విరాట్. ఇక తన సక్సెస్ కంటే తోటి ఆటగాళ్ల సక్సెస్ ను ఎంజాయ్ చేసే విరాట్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తే.. ఆతల యొక్క నాదం అంటే ఇదే అంటూ కామెంట్స్ చేసాడు. అయితే టెన్నిస్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు అందుకున్న దిగజ్జ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఈరోజు ఆటకు వీడ్కోలు అనేది చెప్పినా విషయం తెలిసిందే.

Advertisement

ఈరోజు లేవర్ కప్ 2022లో.. రోజర్ ఫెదరర్.. తన అత్యుత్తమ ప్రత్యర్థి.. స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్‌తో కలిసి ఆడాడు. అయితే ఈ మ్యాచ్ అనేది ముగిసిన తర్వాత రోజర్ ఫెదరర్ అందరి ముందు తన కనీళ్లను దాచుకోలేకపోయాడు. ఇక రోజర్ ఫెదరర్ ఏడుస్తుంటే… ప్రత్యర్థి అయిన రఫెల్ నాదల్‌ కూడా ఏడవటం అనేది అందరి మనసులను కదిలించింది.

Advertisement

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఇలా ఒక్కరి పైన ఒక్కరు ఎమోషన్స్ అనేవి పెట్టుకుంటారా.. ఇదే ఆటల యొక్క అందం. క్రీడ ప్రపంచంలో ఇదే ఇప్పటి వరకు నేను చూసిన అత్యుత్తమ ఫోటో. ప్రత్యర్థి నీ కోసం ఏడుస్తున్నాడు అంటే అంతకంటే గొప్ప విషయం ఏం ఉండదు. వీరి పైన రెస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది అంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

బాబర్ ముందు కోహ్లీ కూడా వేస్ట్..!

22 మందిని బోల్తా కొట్టించిన అక్షర్ పటేల్..!

Visitors Are Also Reading