ఐపీఎల్ 2022 లో కోహ్లీ అంతగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. అయితే 2013 నుండి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు కెప్టెన్ వ్యవరించిన కోహ్లీ… గత ఏడాది ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక ఆ వెంటనే కోహ్లీకి ఎంతో సన్నిహితుడైన ఏబీ డివిలియర్స్ కూడా ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూర్ జట్టు అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Advertisement
అయితే ఇప్పుడు ఆ అభిమానులకు సంతోషం కలిగించే వార్తను విరాట్ కోహ్లీ చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కోహ్లీ డివిలియర్స్ గురించి మాట్లాడుతూ… ఏబీ ప్రస్తుతం అమెరికాలో గోల్ఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నేను ఇక్కడ అతడిని చాలా మిస్ అవుతున్నాను. కానీ అప్పుడప్పుడు ఏబీతో ఫోన్ లో మాట్లాడుతున్నా.. అలాగే అతను కూడా మెసేజ్‌లు చేస్తుంటాడు. ఏబీ అక్కడ ఉన్న ఐపీఎల్ మ్యాచ్ లను ముఖ్యంగా మా జట్టు ఆడే మ్యాచ్ లను చూస్తాడు.
Advertisement
అలాగే మా ఆటను పరిశీలించి కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాడు. అయితే వచ్చే ఏడాది ఏబీ మళ్ళీ ఆర్‌సీబీ జట్టులోకి వస్తాడు అని నేను అనుకుంటున్నాను అంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఇది కోహ్లీ మాటలు విన్న ఎవరికైనా వచ్చే ఐపీఎల్ 2023 లో ఏబీ మళ్ళీ కనిపిస్తాడు అనేది అర్ధం అవుతుంది. కానీ ఏ రూపంలో కనిపిస్తాడు అనేది తెలియదు. అతను రిటైర్మెంట్ వెన్నకి తీసుకొని ఆటగాడిగా వస్తాడా.. లేదా కోచింగ్ బృందంలో భాగం అవుతాడా అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
ఆసియా కప్ పై లంక బోర్డు కీలక వ్యాఖ్యలు..!
విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?