భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసినదే. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది వందవ టెస్ట్ కావడం విశేషం. విరాట్‌ను అందరూ సెంచరీ చేయాలని ఆశీర్వదించగా.. విరాట్ మాత్రం.. 75 బంతుల్లో 45 పరుగులు సాధించారు. సెంచరీ సాధించాలనే వారం రోజుల పాటు ప్రాక్టిస్ చేసిన కోహ్లీ కాస్త నిరాశ చెందాడనే చెప్పవచ్చు.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ ఘనంగా సన్మానించింది. ముఖ్యంగా బీసీసై తరుపున కోచ్ రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీని సత్కరించి.. ప్రత్యేక క్యాప్ అందజేశారు. ఇక విరాట్ కోహ్లీ మైదానంలో అడుగు పెట్టగానే ఆయన అభిమానులు ఫుల్ జోష్‌లోకి వచ్చారు. రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీని సన్మానించడంపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 18 ఏళ్ల నాటి ఫొటోను షేర్ చేసింది.
అండర్ -15 నాటి విరాట్ ఫొటోను జత చేసి ఎలా ప్రారంభమై.. ఎలా కొనసాగుతున్నది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందులో విరాట్ కోహ్లీ చాలా క్యూట్‌గా రాహుల్ ద్రవిడ్‌ను చూస్తున్నాడు. అదే కోహ్లీ ఇప్పుడు రాహుల్ చేతుల మీదుగా మెమొంటో అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : పవన్ కల్యాణ్ పై దర్శకుడు హరీష్ శంకర్ నిరాశ.. అందుకేనా..?