భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇప్పుడు జరుగుతున్న చర్చ గతంలో ఏ క్రికెటర్ పైన కూడా జరగలేదు అనేది నిజం. అయితే అంతలా కోహ్లీపైన చర్చ జరగడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. అదని క్రేజ్. అవును గతంలో ఏ క్రికెటర్ కూడా కోహ్లీ అంత క్రేజ్ లేదు. అందుకే వారి గురించి అంత చర్చ అనేది లేదు. ఇక ఈ క్రికెట్ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి పరుగుల వరద అనేది పారించాడు విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు మాత్రం చిన్న కాలువ కూడా పారించలేకపోతున్నాడు. తాజాగా వెళ్లిన ఇంగ్లాండ్ పర్యటనలో అయితే పూర్తిగా విఫలం అయ్యాడు విరాట్.
Advertisement
ఇక ఈ పర్యటన తర్వాత విరాట్ పై పెద్ద రచ్చే జరగగా.. అతను విండీస్ పర్యటన నుండి పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకున్నాడు. ఆ క్రమంలోనే జింబాంబ్వే పర్యటనకు కోహ్లీ వెళ్లనున్నాడు అని వార్తలు వచ్చినా.. నిన్న జింబాంబ్వే పర్యటనకు ప్రకటించిన జట్టులో కూడా కోహ్లీ లేడు. అందువల్ల ఈ విషయంపై పెద్ద చేర్చే జరిగింది. బీసీసీఐ కావాలనే కోహ్లీని దూరం పెడుతుంది అని కామెంట్స్ చేసారు. కానీ ఈ జింబాంబ్వే టూర్ నుండి కూడా దూరంగా ఉండాలని కోహ్లీనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Advertisement
ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరికి విరాట్ గుడ్ న్యూస్ అనేది చెప్పాడు. తాను ఈ జింబాంబ్వే పర్యటన తర్వాత భారత జట్టు పాల్గొనబోయే ఆసియా కప్ కు తప్పకుండ అందుబాటులో ఉంటాను అని ప్రకటించాడు. అలాగే ఈ టోర్నీకి మాత్రయీ కాకుండా ఆ తరత కూడా భారత జట్టుకి అన్ని మ్యాచ్ లకు తాను అందుబాటులో ఉంటాను అని కోహ్లీ పేర్కొన్నాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ మధ్య కోహ్లీ రెస్ట్ ఎక్కువ కావడంతో ఆ స్తానంలో వచ్చిన యువ ఆటగాళ్లు అదరగొట్టడంతో కోహ్లీ స్థానానికి ముప్పు అనేది వచ్చింది. కాబట్టి ఈ ఆసియా కప్ కు కోహ్లీని ఎంపిక చేస్తారా అనే విషయం చూడాలి.
ఇవి కూడా చదవండి :