Telugu News » Blog » అభిమానులకు తన విషయంలో క్లారిటీ ఇచ్చిన రాహుల్..!

అభిమానులకు తన విషయంలో క్లారిటీ ఇచ్చిన రాహుల్..!

by Manohar Reddy Mano
Ads

భారత జట్టుకు గత కొన్ని నెలలుగా రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్నాడు కేఎల్ రాహుల్. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఎప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభించే కేఎల్ రాహుల్.. రోహిత్ లేని సమయంలో జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అనేవి నిర్వహిస్తాడు. కానీ గత కొన్ని రోజులుగా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు కేఎల్ రాహుల్. ఐపీఎల్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ముందు గాయపడిన రాహుల్.. ఆ కారణంగా ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ తాజాగా టీం ఇండియా వెళ్లిన విండీస్ పర్యటనకు ఎంపిక అయ్యాడు. కానీ కరోతి కారణంగా ఆ స్థానానికి కూడా కోల్పోయాడు.

అందువల్ల రాహుల్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ పర్యటన అంతరం టీం ఇండియా వెళ్లే జింబాంబ్వే పర్యాటకు రాహుల్ జట్టులోకి వస్తాడు.. కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ నిన్న ఈ టూర్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన ఆటగాళ్లలో రాహుల్ లేడు. ఇక ఈ పర్యటనకు కూడా శిఖర్ ధావన్ నే కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ. అందువల్ల తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు తన ఎంపిక విషయంలో క్లారిటీ ఇచ్చాడు రాహుల్.

తన ట్విట్టర్ లో… నా ఫిట్నెస్ గురించి ముకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్న. జర్మనీలో నాకు జరిగిన చికిత్స సక్సెస్ అయ్యింది. దాంతో ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావాలని అనుకున్నాను. అందుకే ఎన్సీఏలో శిక్షణ ప్రారంభించాను. విండీస్ టూర్ కి ఎంపిక అయ్యాను. కానీ అదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చింది. అందువల్ల మళ్ళీ ఫిట్నెస్ అనేది మొదటికి వచ్చింది. ఇప్పుడు క్వారంటైన్ కు సమయం ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ సాధించాలి. అందుకే నేను జింబాంబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ నేను మాత్రం వీలైనంత త్వరగా కోలుకొని… మళ్ళీ జట్టుకి అందుబాటులోకి రావాలని అనుకుంటాను అని రాహుల్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కెప్టెన్ల కంటే ఎక్కువ ఓపెనర్లను మారుస్తున్న టీం ఇండియా… ఎందుకు..?

ఈ ఫోటోలో షెఫాలీ వర్మను నాట్ ఔట్ గా ఇచ్చారు.. ఎందుకంటే..?


You may also like