Home » మళ్ళీ బేసిక్స్ నుండి కోహ్లీ.. చిన్ననాటి కోచ్ అకాడమీకి పయనం…!

మళ్ళీ బేసిక్స్ నుండి కోహ్లీ.. చిన్ననాటి కోచ్ అకాడమీకి పయనం…!

by Azhar
Ad

ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎవరిని కదిలించినా కూడా విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో పరుగుల వరద అనేది పారించిన విరాట్.. మూడేళ్ళుగా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. తన స్థాయి ప్రదర్శన అనే కాదు.. టేలెండర్ బ్యాటింగ్ చేసిన విధంగా చేస్తున్నాడు. అయితే ఇంతలా కోహ్లీపై విమర్శలు రావటానికి మరో కారణం… ఒక్కే విధంగా ఔట్ కావడం. ఇంగ్లాండ్ సిరీస్ లో కోహ్లీ నాటిన అన్ని మ్యాచ్ లలో ఒక్కే రకమైన బంతికి.. ఒక్కే విధంగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. అందువాల కోహ్లీని అందరూ విమర్శిస్తూ ఉన్నారు.

Advertisement

ఇలాంటి సమయంలో కోహ్లీ బీసీసీఐని విశ్రాంతి కోరాడు. అయితే ఈ ఇంగ్లాండ్ పర్యటన అనేది ముగించుకున్న భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. ఇక్కడ మొదట వన్డే సిరీస్ లో పాల్గొనబోతుంది. అయితే ఈ పర్యటన నుండి కోహ్లీ, రోహిత్ తో పాటు ప్రతి సీనియర్ ఆటగాడికి విశ్రాంతి ఇచ్చింది. కానీ ఆ తర్వాత జరగనున్న 5 టీ20 ల సిరీస్ లోకి మళ్ళీ అందరూ వచ్చినా.. కోహ్లీ విశ్రాంతి తీసుకొని తప్పుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ ఎంజాయ్ చేయడానికి ఇలా చేసారు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. విరాట్ ఈ సమయాన్ని తమ కంబ్యాక్ కోసం వాడనునట్లు తెలుస్తుంది.

Advertisement

అందుకే తన బేసిక్స్ పైన దృష్టి పెట్టిన విరాట్.. తన చిన్ననాటి కోచ్ అయిన రాజ్ కుమార్ శర్మ యొక్క అకాడమీకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీని పై రాజ్ కుమార్ శర్మ కూడా మాట్లాడుతూ.. కోహ్లీ ఇప్పుడు నా అకాడమీకి వస్తున్నట్లు తెలిపాడు. అతను ఇక్కడే కొంతకాలం ఉంటాడు. మేము అతని టెక్నీక్స్ పైనే దృష్టి అనేది పెడుతాం. నిజంగా అందులో ఏమైనా లోపాలు అనేవి ఉంటె సరి చేసుకుంటాం అని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు. అయితే ఈ గ్యాప్ తర్వాత కోహ్లీ నేరుగా ఆసియా కప్ కి వస్తాడా… లేక జింబాంబేతో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొంటాడ అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ధోని అభిమానిని కానీ.. ఇండియాకు కాదు అంటున్న పాక్ ప్లేయర్..!

కెప్టెన్ అయిన పుజారా.. ఎలా అంటే…?

Visitors Are Also Reading