Home » ధోని అభిమానిని కానీ.. ఇండియాకు కాదు అంటున్న పాక్ ప్లేయర్..!

ధోని అభిమానిని కానీ.. ఇండియాకు కాదు అంటున్న పాక్ ప్లేయర్..!

by Azhar
Ad
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచం అంతటా అభిమానులు ఉంటారు. మన అజాత శత్రువు అయిన పాకిస్థాన్ లో కూడా ధోనికి ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఇక అక్కడ పాకిస్థాన్ తరపున ఆడే ఆటగాళ్లలో కూడా ఎంతో మంది ధోనికి అభిమానులే. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతారు. ఇక అందులో పాకిస్థాన్ ఆటగాడు హరిస్ రౌఫ్ కూడా ఉన్నాడు. కానీ తాజాగా ఈ ఆటగాడు చేసిన కొన్ని కామెంట్స్ అనేవి వైరల్ గా మారుతున్నాయి. వాటిపైన భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో టీం ఇండియా, పాకిస్థాన్ జట్టు మొదటి మ్యాచ్ లోనే తలపడ్డాయి. అప్పుడు మన జట్టు మెంటార్ గా ధోనిని నియమించింది బీసీసీఐ జట్టు. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో మనం ఓడిపోయిన విషయం ఎవరు మర్చిపోరు. 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో ప్రపంచ కప్ టోర్నీలో టీం ఇండియా అనేది ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు అందరూ వచ్చి.. ధోని చుట్టూ చేరి మాట్లాడటం ప్రారంభించారు. ధోని మాటలను చేతులు కట్టుకొని మని వింటూ కనిపించరు.
ఇక అప్పుడు గ్యాంగ్ లో హరిస్ రౌఫ్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా హరిస్ రౌఫ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పుడు ధోనితో మాట్లాడిన మాటలను బయటపెట్టాడు. అయితే నేను ధోనికి వీరాభిమానిని. అందుకే ఆరోజు ఆయను కలిసిన తర్వాత నాకు మీ జెర్సీ కావాలని అడిగాను. కానీ ఆ తర్వాత నాకు ఇండియా జెర్సీ వద్దు. ఐపీఎల్ యొక్క చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ఇవ్వాలని చెప్పను. ధోని కూడా కొన్ని రోజులకు నాకు తన జెర్సీని పంపాడు. అయితే ఇప్పుడు అదే మాటలపై ఫెయిర్ అవుతున్న భారత అభిమానులు.. ధోని జెర్సీ కావాలి.. కానీ అతనిదే ఇండియాది వద్ద.. మేము ఎప్పుడు ఇండియా, పాక్ గొడవల గురించి ఆలోచించం అని చెప్పే పాక్ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం చాలా ఘోరం.. ధోని కూడా జెర్సీ పంపడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading