విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు మాస్టర్ సచిన్ టెండూల్కర్ కి అభిమానులు ఎలా ఉండేవారో ఇప్పుడు విరాట్ కోహ్లీకి అదేవిదంగా అభిమానులుంటున్నారు. ఈమధ్య కాలంలో మాత్రం విరాట్ కోహ్లీ అంతగా ఫామ్ లో కొనసాగుతలేడనే చెప్పాలి. ఇటీవలే కోహ్లీ ప్రాక్టీస్ కోసం తన పాత కోచ్ వద్దకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం.
విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ తన ఫిట్‌నెస్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. కోహ్లీ పంజాబీ పాటలపై తెగ కసరత్తులు చేస్తూ కనిపించాడు. కోహ్లీ చేసిన ఈ ఫిట్‌నెస్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటికి 25లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కోహ్లీ రీల్ ను పోస్ట్ చేస్తూ.. చాలా కాలంగా పెండింగ్ లో ఉందని.. అయితే ఇది చాలా ఆలస్యం కాదంటూ రాసుకొచ్చాడు. భారతజట్టు ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉంది.
ఇక వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో కోహ్లీ తన కోచ్ వద్ద ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ఆగస్టులో ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, 5 టీ-20 మ్యాచ్ లను ఆడనున్నది. దీంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే టీ-20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ-20, వన్డేల సిరీస్‌కి సంబంధించి షెడ్యూలు విడుదల చేసింది బీసీసీఐ. ఇన్ స్టా గ్రామ్‌లో 200 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో తొలి క్రికెటర్ గా కోహ్లీ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న భారతీయుడిగా నిలిచాడు. దాదాపు 200 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే 200 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.
Also Read :
మహిళా బౌలర్ తో కేఎల్ రాహుల్..!