దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక టీమిండియా బ్యాటర్లు సమష్టిగా విఫలం కావడంతో భారత్‌కు ఘోర ఓటమి తప్పలేదు. అయితే సౌతాఫ్రికా బౌలర్ల దాడిని ఎదుర్కొంటూ అడ్డుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు సాధించాడు. . ఈ పరుగులతో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
Advertisement
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ మొత్తం 114 పరుగులు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాలో 38 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 6 సెంచరీలతో మొత్తం 1724 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు మొత్తం 29 మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి 5 సెంచరీలతో 1750 పరుగులు సేకరించాడు. దీంతో సఫారీల గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
అదేవిధంగా ఈ మ్యాచ్‌లో మొత్తం 114 పరుగులతో విరాట్ కోహ్లీ 2023లో 2000+ పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఒక్క ఏడాదిలో 2 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంక కుమార సంగక్కర పేరిట ఉండేది. సంగక్కర ఒక సంవత్సరంలో 6 సార్లు 2 వేలకు పైగా పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ 7వ సారి ఏడాదిలో 2000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఏడాది వ్యవధిలో 7 సార్లు 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లినే కావడం విశేషం. ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తాడో వేచి చూడాలి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.