భారత జట్టులో ప్రస్తుతం టాప్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ కెరియర్ లో ఇప్పటివరకు 71 సెంచరీలు అనేవి కోహ్లీ సాధించాడు. అయితే విరాట్ 2019 లో తన 70వ సెంచరీ చేయగా.. దాదాపు మూడేళ్ళ తర్వాత 71వ సెంచరీ చేసాడు. దాంతో ఇంటర్నేషనల్ లెవల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో రికీ పాంటింగ్ తో కలిసి ఉన్నాడు.
Advertisement
వీరి కంటే ముందు భారత మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ఉన్నాడు. అయితే సచిన్ యొక్క ఈ ఫిట్ అనేది సాధించగల సత్తా అనేది కేవలం కోహ్లీకే ఉంది అని చాలా మంది కామెంట్స్ చేసారు. అయితే కోహ్లీ ఈ ఫిట్ అందుకోవాలంటే ఏం చేయాలి అనేది పాంటింగ్ చెప్పాడు.
Advertisement
పాంటింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 34 ఏళ్ళు ఉన్న కోహ్లీ.. ఇంకా నాలుగు ఏళ్ళు తప్పకుండ క్రికెట్ ఆడుతాడు. కానీ అతను 100 సెంచరీల కోసం ఇంకా 29 సెంచరీలు చేయాలి. అది అంత సులభం కాదు. కానీ ఇప్పటి నుండి కనీసం ఏడాదికి 5 కంటే ఎక్కువ సెంచరీలు అనేవి కోహ్లీ చెయ్యాలి. టీ20ల్లో కూడా విరాట్ శతకం సాధిస్తేనే.. అది సాధ్యం అవుతుంది. కానీ కోహ్లీకి అది కష్టమైన పని. అయిన కూడా ఓపెనర్ గా వస్తే కోహ్లీ పొట్టి ఫార్మాట్ లో కూడా సెంచరీ చేయవచ్చు అని పాంటింగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :