భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ సమయస్ఫూర్తికి ఫిదా అయ్యాడు. నిన్న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠంగా సాగింది. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను విరాట్ కోహ్లీ విజయం వైపు తీసుకువచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఇండియాకు 16 పరుగులు కావాలి. ఆ సమయంలో ఓ నో బాల్ సిక్స్ పోవడం.. తర్వాత మూడు రావడం వంటివి జరగడంతో ఇండియాకు రెండు బంతుల్లో రెండు పరుగులు కావాల్సి వచ్చింది.
Advertisement
కానీ అప్పుడే దినేష్ కార్తీక్ ఔట్ అయ్యాడు. ఇక ఒక్క బంతికి రెండు పరుగుల సమయంలో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ఇక కోహ్లీ అశ్విన్ కు ఆఫ్ సైడ్ బంతిని ఆడమని చెప్పాడు. కానీ అప్పుడే అశ్విన్ తన సమయస్ఫూర్తిని ఉపయోగించాడు. నవాజ్ వేసిన బంతికి.. పూర్తిగా లైన్ లోకి వచ్చాడు. అందువల్ల ఆ బంతి వైడ్ అయ్యిపోయింది.
Advertisement
అందువల్ల ఒక్క బంతికి ఒక పరుగు కావాల్సి రాగ.. అశ్విన్ ఆ బంతిని మిడ్ సర్కిల్ బయటకు కొట్టడంతో ఇండియా విజయం అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. అశ్విన్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నాడు. అలా బాల్ వదిలేసి లైన్ లోకి రావడానికి చాలా ధైర్యం ఉండాలి అని చెప్పాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో పాక్ గెలుపుతూ గత ప్రపంచ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.
ఇవి కూడా చదవండి :