Telugu News » Blog » ఇండియా, పాక్ మ్యాచ్.. గూగుల్ సీఈఓ కౌంటర్..!

ఇండియా, పాక్ మ్యాచ్.. గూగుల్ సీఈఓ కౌంటర్..!

by Manohar Reddy Mano
Ads
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఉండే హైప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న సరే భారత అభిమానులు అందరూ ఈ మ్యాచ్ ను చూస్తూనే ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సర్చ్ ఇంజన్ గా ఉన్న గూగుల్ కు మన భారత్ కు చెందిన సుందర్ పిచ్చాయ్ కూడా ఇండియా, పాక్ మ్యాచ్ ను చూసాడు.
అలాగే ఈ మ్యాచ్ పై పాకిస్థాన్ కు కౌంటర్ కూడా ఇచ్చాడు. అయితే ఈరోజు దీపావళి సందర్భంగా సుందర్ పిచ్చాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. అందులో.. హ్యాపీ దీపావళి.. అందరూ ఈ పండుగను మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను అయితే ఈ దీపావళిని ఇండియా, పాక్ మ్యాచ్ లోని ఆఖరి మూడు ఓవర్లను చూస్తూ ఎంజాయ్ చేస్తా.  సూపర్ గేమ్ అంటూ పోస్ట్ చేసాడు.
అయితే ఇండియా గెలుపుతో అసహనంతో ఉన్న ఓ పాక్ ఫ్యాన్ ఈ పోస్ట్ కింద.. మొదటి మూడు ఓవర్లు చూస్తూ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేసాడు. దానికి సుందర్ పిచ్చాయ్ కౌంటర్ అనేది ఇస్తూ అవును తప్పకుండ.. భువి మరియు అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసారు అని పోస్ట్ చేసాడు. అంతే ఇక సుందర్ పిచ్చాయ్ ఇచ్చినా కౌటర్ చూసి.. ఆయన మామూలుగానే గూగుల్ సీఈఓ ఖలీద్ అని ఇండియా ఫ్యాన్స్ అంటున్నారు.