Home » Bhagavanth Kesari: హరికృష్ణ నటించిన ఆ మూవీ ని “భగవంత్ కేసరి” గా రీమేక్ చేస్తున్నారా?

Bhagavanth Kesari: హరికృష్ణ నటించిన ఆ మూవీ ని “భగవంత్ కేసరి” గా రీమేక్ చేస్తున్నారా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా “భగవంత్ కేసరి” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగానే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య బాబు కూతురిగా శ్రీలీల నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

bhagavanth kesari 1

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ మంచి ఎఫెక్ట్ చూపిస్తోంది. తెలంగాణ యాసలో మంచి యాక్షన్ సినిమాగా అనిల్ రావిపూడి “భగవంత్ కేసరి” ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఓ పాత తెలుగు సినిమాకు రీమేక్ గా తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది. హరికృష్ణ , మీనా నటించిన “స్వామి” సినిమాను రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Advertisement

తన చెల్లెళ్ళ మరణానికి కారణమైన వ్యక్తులపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అన్న కాన్సెప్ట్ పై “స్వామి” సినిమా రూపొందింది. ఈ సినిమాకే కొన్ని మార్పులు చేసి “భగవంత్ కేసరి” సినిమాను రీమేక్ చేస్తున్నారని నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, నిజం ఏంటో అక్టోబరు 19న తెలుస్తుంది అంటూ స్పష్టం చేసింది. భగవంత్ కేసరి గురించి ఫాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?

అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!

Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!

Visitors Are Also Reading