పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తో పాటూ మాటలు అందించారు. ఇక ఫిబ్రవరి 25న థియేటర్ లలో ఈ సినిమా విడుదల కాగా మిక్స్డ్ టాక్ వస్తోంది. నిజానికి సినిమా విడుదల నాడు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయితే ఫ్యాన్స్ సినిమాను బ్లాక్ బస్టర్ అంటుండగా సాధారణ ప్రేక్షకులు మాత్రం ఎలివేషన్స్ ఎక్కువ అయ్యాయని నిరాశచెందారు.
Advertisement
ALSO READ : విడాకుల తరవాత దారుణమైన పరిస్థితులు…వైరల్ అవుతున్న సమంత కామెంట్స్..!
అంతే కాకుండా మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియం చూసిన ప్రేక్షకులకు అయితే ఈ సినిమా నచ్చలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసినట్టు తెలుస్తోంది. నిత్యామీనన్ పవన్ కల్యాణ్ చేసిన అంత ఇష్టం ఏదంయ్యా పాటతో పాటూ సునీల్ రోల్ ను మరికొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించారు.
Advertisement
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వివి వినాయక్ కూడా నటించగా ఆయన పాత్రకు కూడా కత్తెర వేశారట. సినిమాలో వివి వినాయక్ దర్శకుడి గా నటించాడు. అదో కామెడీ రోల్….అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో వివి వినాయక్ ఫోన్ చేసినట్టుగా చూపిస్తారు కానీ మరెక్కడా ఆయన కనిపించరు.
ఈ విషయాన్ని వివి వినాయక్ స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా వివి వినాయక్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. అప్పట్లో పలు ప్రాజెక్టులు వినిపించినా వాటిపై మళ్లీ వార్తలు వినిపించలేదు. ఇదిలా ఉంటే వివి వినాయక్ హీరోగా కూడా ఓ సినిమాను ప్రారంభించారు. సీనయ్య పేరుతో సినిమా ప్రారంభం కాగా అవుట్ పుట్ గొప్పగా రాకపోవడంతో ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు.