Home » తంగలాన్ టీజర్ మామూలుగా లేదుగా.. విక్రమ్ కి మరో నేషనల్ అవార్డు పక్కా..!

తంగలాన్ టీజర్ మామూలుగా లేదుగా.. విక్రమ్ కి మరో నేషనల్ అవార్డు పక్కా..!

by Anji
Ad

శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, శేషు లాంటి సినిమాల పేర్లు వినగానే ఆ క్యారెక్టర్స్ ని మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన చియాన్ విక్రమ్ గుర్తుకు వస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల విక్రమ్ చేసిన సినిమాలు బాగోలేవు అనే మాటని చాలాసార్లు వింటుంటాం. కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకు వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్ ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్ చాలా ముందుంటాడు.

Advertisement

అందుకే అతని ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత విక్రమ్ హిట్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లో ఒకరైన పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సినిమా తంగలాన్. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. విక్రమ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్ డ్ మూవీగా  తంగలాల్ తెరకెక్కుతోంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్ గా మాళవిక మోహనన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తంగలాన్ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ తంగలాల్ టీజర్ బయటకి వచ్చింది. నిమిషంన్నర నిడివితో కట్ చేసిన తంగలాల్ టీజర్ ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. 

Advertisement

యుగానికి ఒక్కడు, మరుదనాయుగం సినిమాలు గుర్తు చేసే రేంజ్ లో తంగలాన్ సెటప్ ఉంది. విక్రమ్ గెటప్, ఆర్టిస్టుల లుక్ ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ అయితే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తున్నాడు.  టీజర్ కి జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. టీజర్ లో విక్రమ్, పాముని చేత్తోనే ముక్కలు చేసే సీన్ లో విజువల్స్ చాలా రియాలిస్టిక్ గా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే తంగలాన్ టీజర్ చూడగానే విక్రమ్ ఖాతాలో మరో నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనే కామెంట్ చేస్తున్నారు అంటే టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో  ఇక మనం అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!       తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading