Home » రాజమౌళి అప్ కమింగ్ సినిమాలపై విజయేంద్ర ప్రసాద్ సెన్షేషన్ కామెంట్స్..!

రాజమౌళి అప్ కమింగ్ సినిమాలపై విజయేంద్ర ప్రసాద్ సెన్షేషన్ కామెంట్స్..!

by Anji
Ad

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఈ సినిమా తెరకెక్కించినా ఆ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి RRR వరకు ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాకుండా సక్సెస్ బాటలోనే పయణించాడు. ఇటీవల విడుదలైన RRR తరువాత రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో జక్కన్న సినిమాల గురించి ఇంటర్నేషనల్ లెవల్ లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సమయంలో మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది.

Advertisement

త్వరలో జక్కన్నకు వారసుడు రాబోతున్నాడనేది ఫిలింనగర్ లో నయా డిస్కషన్. ఇటీవల ఇంటర్వ్యూలో రాజమౌళి అప్ కమింగ్ సినిమాల గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం మహేష్ సినిమా వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు జక్కన్న. ప్యారలల్ గా  RRR  సీక్వెల్ గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. కానీ  RRR  పార్ట్ 2కి రాజమౌళి దర్శకుడిగా వ్యవహరించకపోవచ్చనే హింట్ కూడా ఇచ్చాడు. జక్కన్న దర్శకత్వం చేయకపోతే  RRR 2ని ఎవరు రూపొందిస్తారు ? సెకండ్ ఇన్ స్టాల్మెంట్ గ్లోబల్ రేంజ్ అన్న టాక్ ఉంది. హాలీవుడ్ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో మాత్రం మరో ఆసక్తికరమైన వార్త ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఇప్పటికే బాహుబలి మూవీతో కొడుకు కార్తికేయను సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పరిచయం చేశారు రాజమౌళి.  RRR  మూవీ విషయంలో అంతా తానే వ్యవహరించాడు జక్కన్న వారసుడు. అందుకే  RRR  సీక్వెల్ తో కార్తికేయను పూర్తిస్థాయి దర్శకుడిగా పరిచయం చేస్తారా..? అనే చర్చ కొనసాగుతుంది. రాజమౌళి సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా కార్తికేయ కీ రోల్ ప్లే చేస్తుంటారు. RRR  కి ఆస్కార్ రావడం వెనుక ఈయంగ్ టెక్నీషియన్ కృషి చాలానే ఉంది. అందుకే విశ్వవేదిక మీద కార్తికేయకు మాత్రమే థ్యాంక్స్ చెప్పారు కీరవాణి. ప్రస్తుతం జక్కన్న లైనఫ్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా వారసుడి ఎంట్రీ మాత్రం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం రాజమౌళి నుంచి క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి మరీ. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

 “గుంటూరు కారం” సినిమా అసలు స్టోరీ లీక్.. అందుకే టైటిల్ కూడా మార్చేశారా ?

Visitors Are Also Reading