Home » పక్కా ప్లాన్ తో విజయ్… వైరల్ అయిన ఫస్ట్ స్పీచ్..!

పక్కా ప్లాన్ తో విజయ్… వైరల్ అయిన ఫస్ట్ స్పీచ్..!

by Sravya
Ad

విజయ్ దళపతి పక్క ప్లాన్ తో వచ్చాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాల్లో సక్సెస్ ని అందుకొని తనదైన శైలిలో దూసుకు వెళ్ళిపోతున్నారు. తమిళనాట భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకున్నారు. పాలిటిక్స్ లోకి రావాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు పార్టీ పేరును కూడా ప్రకటించారు విజయ్. తాజాగా ఆయన ఫ్యాన్స్ తో మాట్లాడారు రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ ఇది. ప్రస్తుతము వైరల్ అవుతోంది. చెన్నైలోని తన కార్యాలయంలో ఫ్యాన్స్ క్లబ్ నాయకులతో వర్చువల్ గా మాట్లాడారు విజయ్. తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ స్పీచ్ ఇది.

Advertisement

Advertisement

విజయ్ స్పీచ్ చాలా ప్లాన్ చాలా హుందాగా ఉందని కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని విజయ్ భర్తీ చేసే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అవరోధాలు, విమర్శల్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలని.. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని తాము చేసే సంక్షేమ కార్యాలయాల కార్యక్రమాల ద్వారా గ్రామాలలో పార్టీకి గుర్తింపు తీసుకో రావాలని తన అభిమానుల్ని ఆయన కోరారు. విజయ్ చాలా క్లియర్ గా పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారు. స్పీచ్ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading