విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ సేతుపతి సుపరిచితమే. చివరిగా విజయ్ సేతుపతి షారుక్ ఖాన్ నటించిన జవాన్ లో కాళీ పాత్ర పోషించారు. తాజాగా ఒక షాకింగ్ నిర్ణయాన్ని విజయ్ సేతుపతి తీసుకున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలు చేసినప్పుడు చాలా సీన్లు కట్ అవుతున్నాయి. విలన్ పాత్రలు చేసేటప్పుడు చెడ్డ వాళ్ల ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడిని తీసుకోవాలని అనుకోవట్లేదు అని విజయ్ సేతుపతి అన్నారు.
విలన్ గా నటించడం చెడ్డదని నేను అనుకోవట్లేదు విలన్ పాత్రకి కొన్ని నిబంధనలు ఉన్నాయి నన్ను చాలా కంట్రోల్ చేస్తారు అని విజయ్ సేతుపతి అన్నారు. అయితే ఇక మీదట విలన్ గా నటించాలని అనుకోవట్లేదు అని ఆ నిర్ణయం తీసుకున్నానని విజయ్ అన్నారు. కనీసం కొన్నాళ్ళు పాటు ఆ పాత్రలను చేయకూడదని నిర్ణయించుకున్నాను.
Advertisement
Advertisement
నేను విలన్ గా నటించకపోతే కనీసం స్క్రిప్ట్ అయినా అడగమని అంటున్నారు. కాబట్టి దానిలో కూడా సమస్యలు ఉన్నాయి. కత్రినా కైఫ్ తో కలిసి మేరీ క్రిస్మస్ లో నటించాడు విజయ్ సేతుపతి. దీనికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి జవాన్ సినిమా తో పాటుగా ఓటీటీలో రిలీజ్ అయిన నకిలీ వెబ్ సిరీస్ లో కూడా అద్భుతంగా నటించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!