Home » ఫ్యామిలీ స్టార్‌లో రష్మికమందన్నాతో విజయ్ దేవరకొండ డ్యాన్స్‌.. మామూలుగా లేదుగా..!

ఫ్యామిలీ స్టార్‌లో రష్మికమందన్నాతో విజయ్ దేవరకొండ డ్యాన్స్‌.. మామూలుగా లేదుగా..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, పరశురాం పేట్ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్‌.  VD13గా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే టైటిల్‌ లుక్‌ను షేర్ చేస్తూ లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ న్యూఢిల్లీలో కొనసాగుతోందని మృణాళ్‌ ఠాకూర్‌, రష్మిక మందన్నా ఇన్‌స్టాస్టోరీస్‌ ద్వారా హింట్‌ ఇచ్చేశారు.

Advertisement

తాము ఒకే లొకేషన్‌లో ఉన్నామని ఈ ఇద్దరూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. రష్మిక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీ రోల్‌లో కనిపించబోతుందని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, రష్మిక మందన్నా మధ్య డ్యాన్స్ సీక్వెల్‌ ఉండబోతుందట. ఈ సీక్వెన్స్‌ను నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో షూట్‌ చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. రష్మిక మందన్నా ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది త్వరలోనే వెల్లడించనున్నారట మేకర్స్‌.

Advertisement

లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్‌మెంట్ అంటే..? అంటే అని అజయ్‌ ఘోష్‌ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ ఫ్యామిలీ స్టార్ టీజర్‌లో విజయ్ దేవరకొండ సింపుల్‌, స్టైలిష్‌గా చెబుతున్న మాస్‌ డైలాగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న 54వ ప్రాజెక్ట్‌.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading