Home » ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో విజయ్ వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో విజయ్ వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

విజయ్ దేవరకొండ, సమంత జంటగ నటించిన మూవీ ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రానుంది ఖుషి. ఈ నేపథ్యంలోనే ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరికీ ఖుషి ఇవ్వడానికే మా ప్రయత్నం అని చెప్పాడు. సెప్టెంబర్ 01న ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుతూ వస్తారని.. చివరగా మీ అందరూ ఇలా నవ్వుతూ ప్రేక్షకులు బయటికి వచ్చే సినిమా అంతకు ముందు ఎప్పుడు ఇచ్చానో గుర్తుకు లేదని చెప్పుకొచ్చాడు.

Advertisement

ముఖ్యంగా హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకి సమంత మెయిన్ అని.. ఆమె లేకపోతే ఈ సినిమానే లేదని చెప్పుకొచ్చాడు. ప్రారంభం నుంచి సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుందనుకునే లోపు సమంతకు హెల్త్ బాలేదు. జులై నెలలో షూటింగ్ ఆపేశాం. స్క్రీన్ పై అంత అందంగా కనిపిస్తుంది. అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఏంటి అని అనుకున్నాం. సడెన్ గా ఓ రోజు న్యూస్ తెలిసింది. మూడు రోజుల్లో వస్తుందనుకున్నాం. కానీ అది ఎంత సీరియస్ అనేది సమంత చెప్పిన తరువాతే తెలిసింది. ఇక ఆ తరువాత మాతో సమంత కాంటాక్ట్ లో లేదు. సెట్ అయిన తరువాత షూటింగ్ లో పాల్గొంది.  ఈ సినిమా ద్వారా సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉందని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. 

Advertisement

ఇక డైరెక్టర్ శివ నిర్వాణ.. నన్ను నమ్మినందుకు స్పెషల్ థాంక్స్. ఆయన నా ఫ్యాన్. ఆ అభిమానాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించాడు. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి పూర్తయ్యే వరకు ముఖంలో చిరునవ్వు పోలేదు. అంతలా కథను నమ్మాడు. తాను ఇండస్ట్రీకి వచ్చి ఆరేడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి అప్పటి నుంచి సక్సెస్, ఫెయిల్యూర్ లో అభిమానులు ఇంత ప్రేమ ఇచ్చారు. లైఫ్ లో ఇప్పుడు చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నాను. నా చుట్టూ మనుషులు మారినా.. మీరు మాత్రం మారదడం లేదు. నా గురించి ఏదో మాట్లాడుతారు. కానీ నాపై అంతే ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరి ముఖాల్లో నవ్వు చూడటమే తన కోరిక అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఆ స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు.. కారణం అదేనా ? 

షారూఖ్ ఖాన్ నుంచి అల్లు అర్జున్ వరకు.. భారత్ లో టాప్ 10 రిచ్ హీరోలు ఎవరో తెలుసా ? 

 

Visitors Are Also Reading