Home » ఖుషి మూవీకి అదే మైనస్ అవ్వనుందా ?

ఖుషి మూవీకి అదే మైనస్ అవ్వనుందా ?

by Anji
Ad

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీస్ సూపర్ స్టార్ సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.  లైగర్, శాకుంతలం వంటి డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం ఇద్దరికీ కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

 

హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి డ్యూరేషన్ మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సెన్సార్ నుండి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 45 నిమిషాలు ఉందని సమాచారం.రొమాంటిక్ లవ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఇంత డ్యూరేషన్ అంటే రిస్క్ అనే చెప్పాలి. సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోతే గనక అంతసేపు థియేటర్లో కూర్చోవడం అనేది కష్టం అవుతుంది. ఇంచు మించు సేమ్ కాన్సెప్ట్ తో  నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోవటానికి ప్రధాన కారణం సినిమా డ్యూరేషన్ అనే చెప్పాలి.

Advertisement

సినిమాలో ఆ మంత్రం కంటెంట్ లేనిది డైరెక్టర్ శివ నిర్వాణ అంత డ్యూరేషన్ పెట్టి రిస్క్ చేయడని చెప్పొచ్చు. గత చిత్రం టక్ జగదీష్ నిరాశపరిచిన క్రమంలో ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని తన సత్తా చాటాలని కసితో ఉన్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. మరి, విజయ్ సమంత కెరీర్ కి బ్లాక్ బస్టర్ తప్పనిసరైన పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుంది అన్నది వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?

హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?

Visitors Are Also Reading